Saturday, March 14, 2009

వేప చెట్టు అమెరికా వాళ్ళు కనిపెట్టారా?


మరి వాళ్ళు అది patent ఎలా చెయ్యగలిగారు? అదొక్కటే కాదు. పసుపు, ఉసిరి, బాసుమతి బియ్యం, అల్లం, ఒకటేమిటి. ఇవన్ని వారు "కనిపెట్టినట్టు", patentకి apply చెయ్యటం, అది American government ఇవ్వటం హాస్యాస్పదంగా వుంది.


మన దేశంలో వందనా శివ గారు, పోరాడి పోరాడి, కొన్నింటిని revoke చేయించారు. వారి పట్టుదల ఎంతైనా అభినందనీయం.


Wednesday, March 4, 2009

కరెంటు లేకుండా ఫ్రిజ్?

నైజీరియాలో కరెంటుతో పనిలేకుండా కూరగాయలు ౩ వారాలు వుంచగలిగే ఉపాయం 2008లో కనిపెట్టారు. కాని మనం ఇది జనతా ఫ్రిజ్ అనే పేరుతో చాలా రోజులనుంచి వాడుతున్నాము. . దీనికి కావల్సింది 2 మట్టి పాత్రలు - ఒక దానిలో ఒకటి పట్టేటట్టు ఈ క్రింది బొమ్మలో లాగా.
చిన్న పాత్రని పెద్ద పాత్రలో పెట్టి, ఆ రెంటి మధ్య ఖాళీని తడి ఇసుకతో నింపాలి. పాత్రలో కూరగాయలు నింపి, పైన తడి గుడ్డతో కప్పాలి. అంతే. నీరు ఇగిరిపోయేటప్పుడు అందులో వున్న వేడిని తనతో తీసుకుని లోపల వున్న కూరగాయలని చల్లగా వుంచుతుంది. ఇలా ౩ వారాలు దాక వుంచవచ్చు. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. వారికి కూరగాయలని వెంటనే అమ్మవలసిన అవసరం వుండదు.

http://www.hinduonnet.com/2000/09/20/stories/0420403e.htm

Thursday, February 5, 2009

Heirloom tomatoes

Try this out. It's very interesting and exciting. Grow these tomatoes in your home.


You will like it.


Sunday, February 1, 2009

వరదలు వచ్చినా పాడవ్వని వరి?

కాలిఫోర్నియాలో శాస్త్రవేత్తలు వరదల్లో 17 రోజులు తడిసినా పాడవ్వని వరిని కనిపెట్టారు. దీని వలన ప్రపంచములో 3 కోట్ల మందిని ఆకలి బాధల నుంచి కాపాడవచ్చు. ఎలా అంటారా? వరదల్లో తడవటం వల్లన ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల వరి నేలపాలు అవుతున్నది. అది కాపాడుకోగలిగితే?

Thursday, January 8, 2009

Saturday, January 3, 2009

Process and liquids


మొదటగా మనం సేంద్రీయ సాగుకి కావాల్సినవి సిద్దం చేసుకుందాము. ఇందులో మొదటిది బయో-డైనమిక్ formula.
ఇంకా ఆవు మూత్రముతో pesticide ఎలా తయారు చెయ్యటం.
Egg Amino
Fish Amino
పచ్చి రొట్టు
పంచగవ్య
Weed and Pest control

పైవి అన్నీను క్రింద వివరించాను.Organic వరి విజయం
ఈ సంవత్సరం రైతుగా నాకు ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకు అంటారా? నా మొట్ట మొదటి organic వరి పంట చేతికి వచ్చింది. 4 సంవత్సరముల కష్ట ఫలితము.

నాకు అన్నిటి కన్న తృప్తినిచ్చిన విషయం నేల తల్లిని రసాయనముల నుంచి విముక్తురాలిని చేయటం. ఆ తల్లి ఎంత ఆనందించి ఉంటదో కద!!! పోనీ ఇది కష్టమా అంటే అదీ కాదు. చాలా తేలిక. అన్ని పదార్థాలు local గా దొరుకుతయి. నేను ఈ process లో నేర్చుకున్నదంతా మీ అందరితో share చేసుకోటానికే ఈ blog create చేశాను.

కొంచం ఓపిక పట్టండి..