Saturday, January 3, 2009

Organic వరి విజయం




ఈ సంవత్సరం రైతుగా నాకు ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకు అంటారా? నా మొట్ట మొదటి organic వరి పంట చేతికి వచ్చింది. 4 సంవత్సరముల కష్ట ఫలితము.

నాకు అన్నిటి కన్న తృప్తినిచ్చిన విషయం నేల తల్లిని రసాయనముల నుంచి విముక్తురాలిని చేయటం. ఆ తల్లి ఎంత ఆనందించి ఉంటదో కద!!! పోనీ ఇది కష్టమా అంటే అదీ కాదు. చాలా తేలిక. అన్ని పదార్థాలు local గా దొరుకుతయి. నేను ఈ process లో నేర్చుకున్నదంతా మీ అందరితో share చేసుకోటానికే ఈ blog create చేశాను.

కొంచం ఓపిక పట్టండి..

7 comments:

  1. ఆహా రమేష్ గారు,ఈ బ్లాగు చదివి నా వళ్ళు పులకించిపోతుందండి.ఎన్నాళ్ళ నుంచి ఇలాంటి బ్లాగు,ఇలాంటి రైతులకోసం చూస్తున్ననో... అభినందనలు,కూడలికి కలిపారా?లేదా?
    నా ఇ-మెయిల్ devarapalli.rajendrakumar@gmail.com
    మెల్లగా మొత్తం చదవాలని కంకణం కట్టుకున్నా :)

    ReplyDelete
  2. ఇలాంటి విషయాలకు మీరు బ్లాగ్ మొదలు పెట్టటం చాలా మంచి ప్రయత్నం మరియు అధ్భుతమైన ఆలోచన. సాధ్యమైనంత వివరంగా రాయటానికి ప్రయత్నించండి. రాజేంద్ర గారితో పాటు మీ బ్లాగులో టపాల కొరకు ఎదురు చూసేవారిలో నేను కూడా ఉన్నాను.

    ReplyDelete
  3. రమేష్ గారు. ఏమి మా అదృష్టము!!! అన్నీ వివరంగా తెలుపమని ప్రార్థన.

    ReplyDelete
  4. ఇప్పుడే మీ బ్లాగు చూశానండి.. మొత్తం చదువుతా.. సేంద్రీయ వ్యవసాయం మీద రైతులంతా దృష్టి నిలపవలసిన సమయం ఇది. మీనుంచి ఎంతో మంది రైతులు ప్రేరణ పొందాలని కోరుకుంటూ..

    ReplyDelete
  5. చాలా మంచి ప్రయత్నం. అభినందనలు.

    ఒక ప్రశ్న-సేంద్రీయ పద్దతుల్లో పెంచిన కూరగాయలు కాని పళ్లు కాని ధర ఎక్కువగా వుంటాయి ఎందుకని. అసలు అవి సేంద్రీయ పద్దతుల్లో పెంచినవే అని మనకి ఎలా తెలుస్తుంది?

    మన పల్లెలలో వెనుకటి రోజులలో ఎరువులు, రసాయనాలు అవీ వాడేవారు కాదు సేంద్రీయ పద్దతులలోనే వ్యవసాయం చేసేవాళ్లు, మరి అప్పుడు ఇంత ధరలు వుండేవి కాదు. అప్పటికీ ఇప్పటికి తేడా ఏమిటంటారు?

    ReplyDelete
  6. మీరందరు నన్ను క్షమించాలి ఆలస్యంగా యిస్తున్నందుకు.
    రాజేంద్ర కుమార్ గారు, కూడలికి కలపలేదు. ఈ బ్లాగు ప్రపంచానికి నేను క్రొత్త. మీకు కావల్సిన వివరాలు అడగండి. నాకు తెలిసినంతమటుకు చెప్పగలను.
    జీడిపప్పు గారు, తప్పకుండా. కొత్తకదా, కొంచము time పడుతుంది.
    థాంక్యూ, మురళిగారు.
    సిరిసిరిమువ్వగారు, inflation కొంత కారణం. fertilizers వగైరాల ధరలు నిర్ణయించేవారి దయ :)

    ReplyDelete
  7. తెలుగుగారు, మిమ్మల్ని నిరుత్సాహపరచననే అనుకుంటున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుడిని.

    ReplyDelete