Saturday, March 14, 2009

వేప చెట్టు అమెరికా వాళ్ళు కనిపెట్టారా?


మరి వాళ్ళు అది patent ఎలా చెయ్యగలిగారు? అదొక్కటే కాదు. పసుపు, ఉసిరి, బాసుమతి బియ్యం, అల్లం, ఒకటేమిటి. ఇవన్ని వారు "కనిపెట్టినట్టు", patentకి apply చెయ్యటం, అది American government ఇవ్వటం హాస్యాస్పదంగా వుంది.


మన దేశంలో వందనా శివ గారు, పోరాడి పోరాడి, కొన్నింటిని revoke చేయించారు. వారి పట్టుదల ఎంతైనా అభినందనీయం.


Wednesday, March 4, 2009

కరెంటు లేకుండా ఫ్రిజ్?

నైజీరియాలో కరెంటుతో పనిలేకుండా కూరగాయలు ౩ వారాలు వుంచగలిగే ఉపాయం 2008లో కనిపెట్టారు. కాని మనం ఇది జనతా ఫ్రిజ్ అనే పేరుతో చాలా రోజులనుంచి వాడుతున్నాము. . దీనికి కావల్సింది 2 మట్టి పాత్రలు - ఒక దానిలో ఒకటి పట్టేటట్టు ఈ క్రింది బొమ్మలో లాగా.
















చిన్న పాత్రని పెద్ద పాత్రలో పెట్టి, ఆ రెంటి మధ్య ఖాళీని తడి ఇసుకతో నింపాలి. పాత్రలో కూరగాయలు నింపి, పైన తడి గుడ్డతో కప్పాలి. అంతే. నీరు ఇగిరిపోయేటప్పుడు అందులో వున్న వేడిని తనతో తీసుకుని లోపల వున్న కూరగాయలని చల్లగా వుంచుతుంది. ఇలా ౩ వారాలు దాక వుంచవచ్చు. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. వారికి కూరగాయలని వెంటనే అమ్మవలసిన అవసరం వుండదు.

http://www.hinduonnet.com/2000/09/20/stories/0420403e.htm